18 May, 2026 | 2:27 AM

సీఎం సహాయ నిధి చెక్కు అందజేత

18-05-2026 12:24 AM

కడ్తాల్,మే 17 (విజయక్రాంతి): సీఎం సహాయనిధి పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆమనగల్లు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కు మండల పరిధిలోని కొండ్రి గాని బోడు తండా గ్రామ పంచాయతీకి చెందిన నేనావత్ నక్కుకు ఆదివారం రూ.36వేల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి బానావత్ శారదా, బిక్కు నాయక్, ఉప సర్పంచి యశోద రాజు నాయక్, చందోజి, లక్పతి నాయక్, రమేష్, పాఠశాల నిర్మల మున్య నాయక్, పాండు నాయక్ తదితరులు పాల్గొన్నారు.