భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు
17-08-2026 05:30 PM
గంభీరావుపేట ఆగస్టు 17 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో సోమవారం నాగుల పంచమి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
ముఖ్యంగా మహిళలు, చిన్నారులు నాగదేవతలకు పాలు పోసి, పుష్పాలు, పండ్లతో నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పండుగ వాతావరణంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడగా, గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.






