8 July, 2026 | 8:03 PM

Breaking News

నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •   ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం   •   ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ శిక్షణ ముగింపు   •   బాన్సువాడలోని ఆదిత్య స్కూల్ పై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు   •  

ముంబై ‘డబుల్ హ్యాట్రిక్’

02-05-2025 01:48 AM
  1. వంద పరుగులతో రాజస్థాన్ ఓటమి
  2. రాణించిన రోహిత్, రికిల్‌టన్
  3. నేడు గుజరాత్‌తో హైదరాబాద్ ‘ఢీ’

జైపూర్, మే 1: ఐపీఎల్ 18వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ‘డబుల్ హ్యాట్రిక్’ నమోదు చేసింది. గురువారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వంద పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.

సీజన్‌లో ముంబైకి ఇది వరుసగా ఆరో విజయం కావడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. రికిల్‌టన్ (61), రోహిత్ (53) అర్థసెంచరీలతో రాణించగా.. సూర్యకుమార్ (48*), పాండ్యా (48*) విధ్వంసం సృష్టించారు. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్, పరాగ్ చెరొక వికెట్ తీశారు.

అనంతరం ఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ 16.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. ఆర్చర్ (30) టాప్ స్కోరర్. ముంబై బౌలర్లలో కర్ణ్ శర్మ, బౌల్ట్  చెరో 3 వికెట్లు తీయగా..  బుమ్రా  వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడం విశేషం. నేడు జరగనున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది