4 September, 2026 | 5:31 PM

ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే జారే

04-09-2026 | 06:10am

ములకలపల్లి, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): ఉచిత కంటి వైద్య శిబిరాన్ని(Free eye medical camp) గురువారం అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ(Jare Adinarayana) ప్రారంభించారు. మండలంలోని సీతారాంపురం గ్రామపంచాయతీ(Seetharampuram Gram Panchayat) సుబ్బనపల్లి గ్రామం(Subbanapalli Village)లో పాల్వంచకు చెందిన శ్రీ బాలాజీ ఐ కేర్ ఆప్టికల్స్(Eye Care Opticals.) వైద్యులు కిషోర్(Kishore) ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కంటి సమస్యలతో బాధపడుతున్న పంచాయతీలోని చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు హాజరయ్యారు.

వీరందరికీ కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించాలని సిఫారసు చేశారు.  ఆశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో పాటు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, కాంగ్రెస్ నాయకులు బత్తుల అంజి, జైరుద్దీన్, సర్పంచి కుంజా రవి,కారం సుధీర్, అంజుమ్,పంచాయతీ కార్యదర్శి కందుకూరి రాంబాబు,సీనియర్ కంటి వైద్య సహాయకులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు