శ్రీ కృష్ణా జన్మాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే జిఎంఆర్
04-09-2026 | 05:22pm
పటాన్ చెరు: శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం పురస్కరించుకొని పటాన్ చెరు డివిజన్ పరిధిలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) నియోజకవర్గ ప్రజలందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు(Sri Krishna Janmashtami celebrations) తెలియజేశారు. అనంతరం మాజీ కార్పొరేటర్, ఆలయ నిర్వహకులు మెట్టు కుమార్ యాదవ్, ఎమ్మెల్యే జిఎంఆర్(MLA GMR)ను ఘనంగా సన్మానించారు. ఈ నాయకులు కార్యకర్తలు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.






