19 May, 2026 | 3:19 AM

వివాహిత దారుణ హత్య

19-05-2026 12:00 AM

చెన్నూర్, మే 18 : మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం ఎల్లక్కపేట గ్రామంలో వివాహిత దారుణ హత్యకు గురైంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చల్ల శారద (24) ను భర్త రమేష్ సుత్తితో  కొట్టి హత్య చేశాడనే అనుమానాలు వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు