4 September, 2026 | 9:25 AM

19 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం

04-09-2026 | 04:10am

ఇద్దరి నిందితుల అరెస్ట్

సుల్తాన్ బజార్ ఏసీపీ మట్టయ్య 

ముషీరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): నారాయణగూడ పోలీస్ స్టేషన్(Narayanguda Police Station) పరిధిలో వరుస ల్యాప్టాప్ల చోరీలకు పాల్పడుతున్న ప్రధాన నిందితుడు సంగిశెట్టి వినీత్ (29), చోరీ సొత్తును కొనుగోలు చేస్తున్న రిసీవర్ వేమునూరి శ్రీనివాస్(29)ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ మేరకు గురువారం నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సుల్తాన్బజార్ ఏసీపీ మట్టయ్య వివరాలు వెల్లడించారు. వీరి నుంచి సుమారు రూ.7.6 లక్షల విలువైన19 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. కేఎంఐటీ కాలేజ్, తెలుగు అకాడమీ పరిసరాల్లోని స్టడీ హాళ్లలో విద్యార్థులు భోజనానికి వెళ్లే సమయంలో ల్యాప్టాప్లను చోరీ చేసి, వాటిని కంప్యూటర్ సేల్స్ అండ్ సర్వీస్ నిర్వాహకుడైన శ్రీనివాస్కు విక్రయించేవాడని పోలీసులు తెలిపారు.

హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలోని 16 కేసుల్లో నిందితుల ప్రమేయం ఉందని గుర్తించారు. ఖైరతాబాద్ జోన్ డీసీపీ కె.శిల్పవల్లి ఐపీఎస్ మార్గదర్శకత్వంలో, సుల్తాన్బజార్ ఏసీపీ పర్యవేక్షణలో నారాయణగూడ ఇన్స్పెక్టర్ ఎం.సాయిదేశ్వర్, డీఐ బి.అభిలాష్, డీఎస్‌ఐ సీహెచ్.నాగరాజు, క్రైమ్ సిబ్బంది సీసీటీవీ, సాంకేతిక ఆధారాలతో నిందితులను అరెస్ట్ చేశారు. క్రైమ్ టీమ్ను డీసీపీ అభినందించి ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు.