2 May, 2026 | 7:49 PM

వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం

02-05-2026 06:28 PM

5న  హుండి  లెక్కింపు.. నిత్య ఆదాయం  40,25,206

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట దేవస్థానంలో శనివారం నిత్య పూజలు వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో స్వయంభూవులను మేల్కొలిపిన అర్చకులు గర్భగుడిలో కొలువు దీరిన స్వయంభులను సువర్ణ ప్రతిష్ట మూర్తులను వేదమంత్రోచరణలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలతో అర్పించారు. ప్రాకారమంటపంలో నృసింహ హోమం, నిత్య కళ్యాణంను వైభవంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణమును చూచి భక్తులు భక్తి పారవశ్యంలో  తేలిపోయారు.

సాయంత్రం వెండి జోడు సేవ స్వామివారు తిరువీధులలో ఊరేగారు. కొండపైన అనుబంధ ఆలయం అయినా శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర ఆలయంలో ప్రతినిత్యం స్పటిక లింగ దర్శన ని ఏర్పాటు చేశారు. భక్తులు సాంప్రదాయ దుస్తులను ధరించి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని దేవస్థానం అధికారులు తెలిపారు... ఈనెల 5 మంగళవారం రోజున హుండీ లెక్కింపు  కొండ కింద వ్రతమంటపo ఆల్ నెంబర్ 2 లో లెక్కింపు జరుగుతుందని ఆలయ ఈవో భవాని శంకర్ ప్రకటనలో తెలిపారు. స్వామివారి నిత్య రాబడి 40,25,206........ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కు వివిధ శాఖల నుండి వచ్చిన ఆదాయం  40,25,206 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.