3 September, 2026 | 11:31 PM

వెయ్యి రోజుల్లో అద్భుతమైన అభివృద్ధి

03-09-2026 | 10:44pm

- ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు 

ఎల్బీనగర్: సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సారధ్యంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల్లో చారిత్రాత్మక నిర్ణయాలతో రాష్ట్రంలో అద్భుతమైన అభివృద్ధి సాధించిందని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పేర్కొంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి 1000 రోజుల ప్రజా పాలన సందర్భంగా గురువారం ఎల్బీనగర్ రింగ్ రోడ్ వద్ద కాంగ్రెస్ పార్టీ(Congress Party) నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ... తెలంగాణలో ప్రజా పాలన – ప్రజా ప్రభుత్వం కొనసాగుతోందన్నారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీలేని విధంగా ముందుకు సాగుతోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల(Election) సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు(Welfare schemes), అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కారం, ఎల్బీనగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేస్తాయని అన్నారు.‌

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, బుడ్డ సత్యనారాయణ, పోచబోయిన సురేశ్ యాదవ్ , మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అశోక్ గౌడ్, రామారావు, డివిజన్ అధ్యక్షులు చెన్నగోని రవి, సునీల్ బాబు, శ్రీనాథ్, రమేష్ నాయక్, చిరంజీవి, కృపాకర్ రెడ్డి, శ్రీధర్ గౌడ్, రవి కేశవ్, ఎస్సీ సెల్ చైర్మన్ రవికుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కడారి బాలకృష్ణ యాదవ్, ఎస్టీ సెల్ గాంధీ నాయక్, సీనియర్ నాయకులు చందు నాయక్, బుగ్గారపు వరుణ్, చిరుమర్తి శేఖర్, ఎర్ర శేఖర్ గౌడ్, కోప్పల వెంకటరెడ్డి, పంగ గౌతం, నాగయ్య గౌడ్, లాలయ్య, భవాని శంకర్, శశికళ, ధనావత్ దర్శి తదితరులు పాల్గొన్నారు.‌

- డాక్టర్స్ కాలనీ డివిజన్ ఏఎస్ఆర్ గార్డెన్స్ లో

1000 రోజుల ప్రజా పాలన – అభివృద్ధి, సంక్షేమం, మార్పునకు నిదర్శనమని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.  డాక్టర్స్ కాలనీ డివిజన్ ఏఎస్ఆర్ గార్డెన్స్ లో మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, టీపీసిసి సభ్యుడు దేప భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు నల్లెంకి ధన్ రాజ్ గౌడ్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల్లో ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం అనేక  కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి వక్కలంక శ్రీనివాస్ రావు, నాయకులు జంగారెడ్డి, జనార్దన్ గౌడ్, యూనిస్, అరుణ, ఆసిఫ్, అప్పారావు, అఫ్జల్, హబీబ్, సత్యం తదితరులు పాల్గొన్నారు.