3 July, 2026 | 11:05 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

కరీంనగర్ డైమండ్స్ హ్యట్రిక్ విక్టరీ

03-07-2026 12:00 AM

హైదరాబాద్, జూలై 2 : తెలంగామ టీ20 లీగ్‌లో కరీంనగర్ డైమండ్స్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఆరంభంలో వరు స ఓటములతో సతమతమైన ఆ జట్టు తాజాగా రంగారెడ్డి రైజర్స్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన కరీంనగర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. రాహుల్ రాదేశ్37 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 72), సింహ 38 బం తుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లలో 60 పరుగులతో రాణించారు.

రంగారెడ్డి బౌలర్లలో తనయ్ జడ్డూ 2, నితిన్ సాయి యాదవ్, తనయ్ త్యాగరాజన్ చెరో వికెట్ తీశారు. భారీ లక్ష్యఛేదనలో రంగారెడ్డి బ్యాటర్లు విఫలమయ్యా రు. ఆదిత్య జవ్వాజి 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జ్ఞానప్రకాశ్ రెడ్డి (23), ఆరోన్ జార్జ్ (19), నితిన్ సాయి యాదవ్ (15) పరుగులు చేశారు. చివర్లో ఆర్యన్ కరియప్ప 20 బంతులో 30 రన్స్ చేసినా ఫలితం లేకపోయింది. రంగారెడ్డి రైజర్స్ 20 ఓవర్లలో 172 పరుగులే చేయగలిగింది. కరీంనగర్ బౌలర్లలో నారాయణ తేజ 3, రత్లావత్ దినే శ్ 2, శుభమ్ శర్మ 2, ఆశిశ్ శ్రీవాత్సవ, సతీశ్ కుమార్ ఒక్కో పడగొట్టారు. ఐదు మ్యాచ్ల్లో రంగారెడ్డికి ఇది రెండో ఓటమి.