calender_icon.png 9 February, 2026 | 4:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నువ్వా.. నేనా..!

09-02-2026 12:00:00 AM

  1. మున్సిపల్ ఎన్నికల్లో బడా నాయకుల విస్తృత పర్యటనలు
  2. బల్దియాల్లో హోరెత్తిన ప్రచారం పీఠం చేజిక్కించుకునేందుకు వ్యూహాలు
  3. ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద

* మున్సిపల్ ఎన్నికల వేడి రోజురోజుకీ పెరుగుతోంది. పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేప థ్యంలో పార్టీల బడా నాయకులు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. జిల్లాలో రెండు మున్సిపాలిటీలుండగా, కాగజ్నగర్ మున్సిపాలిటీలో 30 వార్డుల్లో 50 వేలకుపైగా ఓటర్లు ఉన్నారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డుల్లో 13 వేలకుపైగా ఓటర్లు ఉన్నారు.

రెండు మున్సిపాలిటీల పీఠం చేజిక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ముందుకు వెళుతుండగా, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ తన పదేళ్ల పాలనను ప్రజలకు గుర్తు చేస్తూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభు త్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది. ఇక కాషాయం పార్టీ కూడా తామేమీ తక్కువ కాదంటూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో పట్టణాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలను చైతన్యపరుస్తోంది.

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 8 (విజ యక్రాంతి): మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యం లో రాజకీయ పార్టీల బడా నాయకులు తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆసిఫాబాద్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, ఆమె సోదరి మాజీ సర్పంచ్ మర్సుకోల సరస్వతి విస్తృతంగా ప్రచారం చేపట్టగా, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కోవ అరుణ, మాన్విత్ సాయినాథ్ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా అధ్యక్షు రాలు ఆత్రం సుగుణ, నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీర శ్యాం నాయక్, మాజీ డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు అరి గెల నాగేశ్వరరావు వార్డు కౌన్సిలర్ల గెలుపే లక్ష్యంగా ప్రచారంలో నిమగ్నమయ్యారు.

అలాగే పార్టీ సీనియర్ నాయకులు కాండ్రె విశాల్, సిద్ధంశెట్టి సుహాసిని, అరిగెల మల్లికార్జున్, బోనగిరి సతీష్ బాబు, చర్ల మురళి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాగజ్‌నగర్ లో సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీ ష్‌బాబు, మాజీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, పార్టీ అధ్యక్షుడు ధోని శ్రీశైలం తమ అభ్యర్థులను గెలిపించుకొని కాషాయం జెం డా పాతేందుకు వ్యూహా త్మకంగా ముందుకు సాగుతున్నారు.

బల్దియా పరిధిలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు నివసిస్తుండటంతో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రోడ్షో ద్వారా ప్రచారం నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ సిర్పూర్ నియోజకవర్గంలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఇంటింటి ప్రచారంలో నిమగ్నమయ్యారు.

బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ కలిసికట్టుగా ముందుకు సాగడం గమనార్హం. గతంలో తీవ్ర విభేదాలు ఉన్న వీరిద్దరూ ఒకే వేదికపై కనిపించడంతో గులాబీ పార్టీకి మున్సిపాలిటీ పీఠం ఖాయమన్న చర్చ జోరందుకుం ది. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్కు వచ్చిన విజయాల స్ఫూర్తితో మున్సిపా లిటీలో గులాబీ జెండా ఎగరవేయాలనే లక్ష్యం తో వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.

పార్టీలకు ‘రెబల్స్’ బెడద

మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించిన పలువురు ఆశావహులకు నిరాశ ఎదురవడంతో వారు రెబల్స్గా బరిలోకి దిగారు. రెబల్స్ వల్ల నష్టం ఉండదని భావించిన పార్టీ నేతలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ లో కాంగ్రెస్‌కు చెందిన ఏడుగురు అభ్యర్థులు రెబల్స్ పోటీ చేస్తుండగా, ముఖ్యంగా మూడు వార్డుల్లో ఇది పార్టీ గెలుపుపై ప్రభావం చూపే అవకాశముంది. బీఆర్‌ఎస్‌లోనూ టికెట్ దక్కని పలువురు అసంతృప్తితో బరిలోకి దిగా రు.

అలాగే బీఎస్పీ, జనసేన, సిపిఐ, సిపిఎం, స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఓట్లు ఎవరి వైపు చీలుతాయని చర్చ సాగుతోంది. కాగజ్‌నగర్‌లో కాంగ్రెస్ ముందస్తు చర్యల తో రెబల్స్ బెడద పెద్దగా లేకుండా పోయింది. బీఆర్‌ఎస్‌లో మొదట ఆర్.ఎస్.పీ., కోనప్ప వర్గాలు వేర్వేరుగా అభ్యర్థులను ప్రోత్సహించినప్పటికీ, పార్టీ ఇన్చార్జిగా ఎమ్మె ల్సీ దాసోజు శ్రావణ్‌కుమార్ ఇంచార్జ్ బాధ్యతలు చేపట్టడంతో ఇరువర్గాలను సమన్వయం చేసి సమస్యను పరిష్కరించారు.

బీ-ఫామ్ కేటాయిం పులు సజావుగా జరిగేలా చర్యలు తీసుకొని రెబల్స్ సమస్యను నివారించారు. బీజేపీలో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని, అంద రి అభిప్రాయాలతో అభ్యర్థులకు బీ-ఫామ్లు కేటాయిం చినట్లు తెలుస్తోంది.

నేటితో ప్రచారానికి బ్రేక్

ఈనెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో 9వతేదీ (నేడు) సాయంత్రం 5 గంటలలోపు ప్రచారం ముగియనుంది. పోలింగ్‌కు  48 గంటల ముందు ప్రచారం నిలిపివేయాలని ఎన్నికల నియమావళి పేర్కొనడంతో పార్టీల నేతలు చివరి నిమిషం వరకు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు తమదైన శైలిలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ, తమ పార్టీకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మున్సిపాలిటీల పరిధిలో ఎక్కడ చూసినా ప్రచార హోరు మారుమోగుతోంది.