అధ్యాపకులు మనసుపెట్టి భోదించాలి: ఎన్ఆర్ఐ గోపాల్ టీకే కృష్ణ
ముకరంపుర,(విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయంలో "అంతర్గత నాణ్యత ప్రమాణాల సెల్" ఐ క్యూ ఏసి ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ కన్వీనర్ గా అధ్యాపకులకు భోదన పద్ధతులు, మెళుకువలపై చర్చ కార్యక్రమం రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఇందులో భాగంగా అమెరికాలోని అయోవా రాష్ట్రంకు చెందిన కృష్ణ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ సంస్థ అధ్యక్షులు, ఎన్ఆర్ఐ గోపాల్ టి.కె. కృష్ణ వక్తగా హాజరై మాట్లాడుతూ... విద్యార్థుల ప్రతిభను పెంపొందించడంలో వారికి సృజనాత్మక భావనలను కలిగించడంలో పరిశోధనలలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో అధ్యాపకుల పాత్ర ఎంతో ముఖ్యమని పరిశ్రమలకు విద్యాసంస్థలకు మధ్య బంధాన్ని ఏర్పరచడంలో, పోటీ ప్రపంచంలో అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు విద్యార్థులను మానసికంగా దృఢంగా చేయడంలో అధ్యాపకుల పాత్ర ఎంతో ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులలో ఆత్మ ధైర్యం నింపే ఆచార్యులు ప్రస్తుత సమాజానికి అవసరం అన్నారు.






