భవాని నగర్‌లో ప్రారంభమైన సిమెంట్ రోడ్డు పనులు
20-08-2026 07:25 PM
ఉప్పల్,(విజయక్రాంతి): భవాని నగర్‌లో సుమారు ₹40 లక్షల వ్యయంతో చేపట్టనున్న సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. స్ట్రీట్ నంబర్–3లో జరుగుతున్న పనులను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్ స్థానికులతో కలిసి పరిశీలించారు. త్వరలో స్ట్రీట్ నంబర్–4తో పాటు మిగిలిన వీధుల్లో కూడా సిమెంట్ రోడ్లు, కనెక్టింగ్ రోడ్లు నిర్మిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు రాగిరి మోహన్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, కట్ట బుచ్చన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






