7 April, 2026 | 5:05 PM

Breaking News

ఎమ్మెల్యే విజయ రమణారావుకు నిలువెత్తు దండతో ఘనంగా సన్మానం   •   చంద్ర మహంకాళి ఆలయంలో పూజలు   •   గోపాల్పేట్ శ్రీ నల్లపోచమ్మ నూతన ఆలయ కమిటీ ఎన్నిక   •   పేదల స్వంతింటి కల కాంగ్రెస్‌తోనే సాకారం: ధరావత్ వీరన్న నాయక్   •   'టచ్ చేసి చూడు.. పాకిస్థాన్‌ ముక్కలే'! పాక్‌కు భారత్ స్ట్రాంగ్‌ వార్నింగ్‌   •   గిరిజన గ్రామంలో పోలీసుల గ్రామోత్సవం నిర్వహణ   •   రసాయనాల నియంత్రణతో క్యాన్సర్ నివారణ   •   ఘనంగా జీవీఆర్ జన్మదిన వేడుకలు   •   పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మూడేళ్లు పూర్తయిన సందర్భంగా కేక్ కటింగ్   •   ఐఎన్టీయుసీ కాంట్రాక్ట్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా ఎస్కే బాజీ సాహెబ్   •  

చైనాకు భారత్ షాక్

01-01-2026 12:00 AM
  1. స్టీల్ దిగుమతులపై 12 శాతం పన్ను విధింపు
  2. దేశీయ ఉక్కు తయారీదారుల ప్రయోజనాలను కాపాడేందుకే నిర్ణయం

న్యూఢిల్లీ, డిసెంబర్ 31 :  స్టీలు ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న భారత్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. స్టీలు దిగుమతులపై పన్ను విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. చైనా నుంచి దిగుమతి అవుతున్న చౌక స్టీలు ఉత్పత్తులే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి.. ముఖ్యంగా చైనా నుంచి దిగుమతి అవుతున్న పలు చౌక స్టీలు ఉత్పత్తులపై 12 శాతం పన్ను విధించింది. స్టెయిన్లెస్ స్టీల్ వంటి ప్రత్యేక ఉక్కు ఉత్పత్తులకు కూడా ఇది వర్తిస్తుంది.

దేశీయంగా ఉక్కు తయారీదారుల ప్రయోజనాలను కాపాడేందుకు తీసుకున్న ఈ నిర్ణయంతో చైనాకు షాక్ తగలనుంది. అక్కడి నుంచి మన దేశానికి దిగుమతయ్యే వస్తువులు తగ్గనున్నాయి. చైనా, వియత్నాం, నేపాల్ దేశాలకు ఈ సుంకాలు వర్తించనుండగా పలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు కేంద్రం మినహాయింపు ప్రకటించింది.

కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. స్టీలు ఉత్పత్తులపై దిగుమతి సుంకం మూడేళ్ల పాటు అమలులో ఉంటుంది. తొలి ఏడాది 12 శాతం పన్ను, రెండో ఏడాది 11.5 శాతం, మూడో ఏడాది 11 శాతం పన్ను వసూలు చేయనున్నట్లు పేర్కొంది.

డీజీటీఆర్ సిఫార్సుతోనే నిర్ణయం..

స్టీల్ దిగుమతులు గణనీయంగా పెరగడంతో దేశీయ పరిశ్రమలకు తీవ్ర నష్టం కలుగుతోందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్ (డీజీటీఆర్) తెలిపింది. దీంతో దిగుమతి సుంకం విధించాలంటూ కేంద్రానికి సిఫార్సు చేయగా.. ఆర్థిక శాఖ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.