యువత క్రీడలలో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి
ఘట్‌కేసర్, మార్చి 17 (విజయక్రాంతి) : యువత క్రీడలలో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు వారి సొంతం అవుతుందని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి- కల్పనరెడ్డి దంపతుల 50వ వివాహ వార్షికోత్సవం (గోల్డెన్ జూబ్లీ) పురస్కరించుకుని ఘట్ కేసర్ సర్కిల్, 8వ డివిజన్ పోచారం పరిధి కొర్రెముల వెంకటాద్రి టౌన్ షిప్ సమీపంలో బిఆర్‌ఎస్ నాయకులు సామల సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ లో మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో విజేతలుగా నిలుచున్న క్రికెట్ జట్లకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మల్లారెడ్డి విచ్చేసి ఆయన చేతుల మీదుగా జ్ఞాపిక (ట్రోఫీ) తో పాటు నగదు బహుమతులను అందజేశారు.
ఫైనల్ మ్యాచ్ లో ఘట్ కేసర్, పీర్జాదిగూడ జట్లు తలపడగా హోరాహోరీగా జరిగిన పోటీలో పీర్జాదిగూడ క్రికెట్ జట్టు విజయం సాధించింది. ఈకార్యక్రమంలో మాజీ ఎంపీపీ, బిఆర్‌ఎస్ పార్టీ ఘట్ కేసర్ డివిజన్ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రెడ్యానాయక్, మండల పార్టీ అధ్యక్షులు నాగులపల్లి రమేష్, ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, రైతు సొసైటీ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నాయకులు బద్దం జగన్ మోహన్ రెడ్డి, నీరుడి శ్రీనివాస్, ఎరుకల దుర్గారాజ్ గౌడ్ పాల్గొన్నారు.




