4 April, 2026 | 8:56 AM

యువతలో భక్తి భావం పెరగాలి

03-10-2025 10:34 PM

దుర్గామాత శోదయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి: అడిషనల్ ఎస్పీ రమేష్

నల్గొండ క్రైమ్: యువతలో భక్తి భావం పెంపొందినప్పుడే ఉన్నత లక్ష్యాలను చేరుకుంటారని జిల్లా అదనపు ఎస్పీ రమేష్ అన్నారు. హైదరాబాద్ రోడ్డులో ఉన్న చంద్రగిరి విలాస్ కాలనీలో శుక్రవారం నిర్వహించిన దుర్గామాత శోభాయాత్రను ఆయన పూజా అనంతరం  మాట్లాడారు. భక్తి భావం పెరగడం మంచి మార్గంలో నడిచి ఉన్నత స్థాయిలో స్థిరపడంతో పాటు కుటుంబానికి సమాజంలో గొప్ప గౌరవం లభిస్తుందన్నారు. జిల్లాలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకో కుండా దుర్గామాత శోభా యాత్రలకు అన్ని  ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ఇతర శాఖల సమన్వయంతో పూర్తిస్థాయి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.