28 August, 2026 | 9:51 AM

గవర్నర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్

28-08-2026 01:07 AM
  1. ఆరోగ్య వివరాలపై వైద్యులతో ఆరా
  2. కోలుకొని ప్రజాసేవలో పాల్గొనాలని ఆకాంక్ష

శేరిలింగంపల్లి, ఆగస్టు 27 (విజయక్రాం తి): అనారోగ్యంతో హైటెక్ సిటీలోని యశోద ఆస్పత్రి(Yashoda Hospital)లో చికిత్స పొందుతున్న రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా(Shiv Pratap Shukla)ను తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(A Revanth Reddy) గురువారం పరామర్శించారు. ఆస్పత్రికి చేరుకున్న సీఎం గవర్నర్ వద్దకు వెళ్లి ఆయనతో మాట్లాడారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకు న్నారు. అనంతరం చికిత్స అందిస్తున్న వైద్య బృందంతో మాట్లాడి, వైద్య సేవలపై వివరా లు సేకరించారు.

గవర్నర్ త్వర గా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో పాల్గొనా లని సీఎం ఆకాంక్షించారు. ము ఖ్యమంత్రితో పాటు ఎంపీ వేం నరేందర్ రెడ్డి కూడా ఆస్ప త్రికి వెళ్లి గవర్నర్న్‌ను పరామర్శిం చారు. వై ద్యులు, అధికారుల నుంచి ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తీసుకున్నారు. గవర్నర్ అనారో గ్యంతో ఆస్పత్రిలో ఉన్నారని తెలిసిన వెంట నే సీఎం స్వయంగా వెళ్లి పరామర్శించ డం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే రాష్ట్ర గవర్నర్ ఆరోగ్యంపై ఆసుపత్రి వర్గాలు ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు.