4 September, 2026 | 5:03 PM

బంధువుల ఇంటికి వచ్చి కాల్వలో శవమై తేలిన యువకుడు

04-09-2026 | 01:29pm

ముత్తారం మండలం కేశనపల్లి వద్ద విషాద ఘటన

ముత్తారం,సెప్టెంబర్ 4(విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా ముత్తారం(Muttaram) మండలంలోని కేశనపల్లి గ్రామంలో కెనాల్(Canal) కాల్వలో ఓ యువకుడు మృతదేహంగా తేలిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మృతుడిని మంచిర్యాల జిల్లా మందమర్రి(Mandamarri) ప్రాంతానికి చెందిన బండ సాయిరాం (21)గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయిరాం(Sairam) మూడు రోజుల క్రితం ముత్తారం మండలంలోని హరిపురం(Haripuram) గ్రామంలో ఉన్న తన బంధువుల ఇంటికి వచ్చాడు. అక్కడి నుంచి ఖమ్మంపల్లి గ్రామంలో నివసిస్తున్న మరో బంధువుల ఇంటికి వెళ్లేందుకు బయలుదేరాడు.

అయితే, మార్గమధ్యంలో కేశనపల్లి గ్రామ(Keshanapalli Village) సమీపంలోని కెనాల్ కాల్వలో ప్రమాదవశాత్తు పడిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. శుక్రవారం ఉదయం కేశనపల్లి గ్రామ సమీపంలోని కాల్వలో సాయిరాం మృతదేహం తేలడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువకుడి మృతికి గల పూర్తి కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది