4 April, 2026 | 3:01 PM

Breaking News

గజ్వేల్‌లో పొలిటికల్ హైటెన్షన్.. KCR క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో   •   వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •   హాస్పిటల్ ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన కార్యక్రమం   •  

బడంగ్‌పేట్ భారీ అవినీతిపై జ్యుడీషియల్ విచారణ జరపాలి

04-04-2026 12:00 AM

టీపీసీసీ కార్యదర్శి అమరేందర్ రెడ్డి డిమాండ్

బడంగ్‌పేట్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): బడంగ్‌పేట్  మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన వందల కోట్ల అవినీతి, అక్రమాలపై ఏసీబీ, విజిలెన్స్తో పాటు జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని టీపీసీసీ కార్యదర్శి ఎలిమేటి అమరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం నాదర్గుల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం రెండేళ్లు మాత్రమే కాకుండా, బడంగ్పేట్ నగర పంచాయతీగా ఏర్పడినప్పటి నుంచి (కమిషనర్ త్రిలేశ్వరావు హయాం నుండి) జరిగిన పనులన్నింటిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

ఒకేసారి పది మంది అధికారులు అవినీతి ఆరోపణలతో సస్పెండ్ కావడం ఆందోళనకరమని, దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులను, నాయకులను బయటకు తీయాలని కోరారు.  ఈ అక్రమాలపై జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు మరియు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.కార్యక్రమంలో బోయపల్లి గోవర్దన్ రెడ్డి, బంగారి అశోక్, అమృత నాయుడు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.