సీతారాం ఏచూరి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి: ఎస్‌ఎఫ్‌ఐ

12-09-2026 | 06:58pm

ద్వితీయ వర్ధంతి సందర్భంగా హాస్టల్ కమిటీ ఆధ్వర్యంలో ఘన నివాళి

దామరచర్ల :సెప్టెంబర్ 12:  ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, ప్రజా ఉద్యమాల స్ఫూర్తిదాత కామ్రేడ్ సీతారాం ఏచూరి  ద్వితీయ వర్ధంతి వేడుకలను ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో శనివారం  దామరచర్ల ఎస్టీ బాలుర హాస్టల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ మండల కమిటీ సభ్యులు రాము మాట్లాడుతూ.. సీతారాం ఏచూరి జీవితాంతం కార్మికులు, కర్షకులు, పేదలు, సామాన్య ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడారని అన్నారు. భారతదేశంలో లౌకిక, ప్రజాస్వామ్య, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. దేశంలో మతోన్మాదం, కార్పొరేట్ అనుకూల విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విశాల ప్రజా ఐక్యతను నిర్మించడంలో సీతారాం ఏచూరి గారు కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ హాస్టల్ కమిటీ నాయకులు యశ్వంత్,శంకర్,బాలాజీ,సిద్దు, చరణ్,నాగేంద్రబాబు,సునీల్,సందీప్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు