108 ప్రసాదాలతో అమ్మవారికి ప్రత్యేక నైవేద్యం..
అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ..
చిట్యాల (విజయక్రాంతి): చిట్యాల పట్టణంలోని శ్రీశ్రీశ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు గులాబీ ఎరుపు వస్త్రధారణలో శ్రీ అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా 108 రకాల ప్రసాదాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీత రమేష్(Municipal Chairperson Pandiri Geetha Ramesh) హాజరయ్యారు.
మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఆలయ కమిటీ చైర్మన్ మారగోని ఆంజనేయులు, డైరెక్టర్లు గంజి వెంకటేశం, బుద్ధ విమల కృష్ణమూర్తి, రుద్రారపు లింగస్వామి, జిట్టా సాయిలు, బెలిదె సత్యనారాయణ, ఏళ్ల మాధవి బయ్యన్న, కుమ్మర దేవి రవి, ఆలయ అధికారి ఏనుగు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.