ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకునే విధంగా కృషి

29-10-2026 | 11:01pm

ఎమ్మెల్సీ ఓట్ల పర్యవేక్షణ  కౌన్సిలర్ రెబల్ శ్రీను

తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి మండల పార్టీ అధ్యక్షులురేగటి రవిగౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తుంగతుర్తి మండల కేంద్రంలో గ్రాడ్యుయేట్(MLC) ఓట్ల పర్యవేక్షణకి విచ్చేసిన సూర్యాపేట మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ రెబల్ శ్రీను(Municipal Councilor Rebel Srinu) మాట్లాడుతూ... ఏఐసీసీ టీపీసీసీ బలపరిచిన అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి(Ramreddy Sarvottam Reddy)ని భారీ మెజార్టీతో గెలిపించుటకు ప్రతి నాయకుడు కార్యకర్త కృషి చేయాలని కోరారు.

నవంబర్ 6 వరకు, తుంగతుర్తి మండలములో ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు(Graduate Vote Registration) చేసుకుని  విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రాడ్యుయేట్(MLC) హెల్ప్ డెస్క్ ఇంచార్జి ఆకారపు ఎల్లయ్య  గ్రంథాలయం చైర్మన్ గంగరాజు యాదవ్ , పెద్ద పోయిన అజయ్, ముత్యాల వెంకన్న, కొండా రాజు మరియు కొండా పరుశురాం , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులి ముత్తయ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు