వేడుకగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు
కేకుకోసి, బాణసంచా కాల్చి సంబరాలు
అచ్చంపేట నవంబర్ 23 (విజయక్రాంతి): బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(BRS State General Secretary) ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పుట్టినరోజు వేడుకలను అచ్చంపేటలో ఆ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించుకున్నారు. పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో కేకుకోసి, బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేతలు మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కెసిఆర్ ను రాష్ట్ర ప్రజలు మరోసారి సీఎం గా చూడాలనుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు పి. మనోహర్, తులసీరామ్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు మనోహర్ ప్రసాద్ పటేల్, అంతటి శివకృష్ణ, నేతలు పర్వతాలు, అమీనుద్దీన్, కడెం బుచ్చయ్య, దాసరి మల్లయ్య, కొర్ర వంశీ, మాదవాచారి తదితరులు పాల్గొన్నారు.