జనగణనను పకడ్బందీగా నిర్వహించాలి...

13-10-2026 | 04:42pm

సాంకేతిక శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సి.హెచ్ మహేందర్ జి

ములుగు (విజయక్రాంతి): జనగణనను పకడ్బందీగా నిర్వహించేందుకు సిబ్బంది తమ విధులపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సి.హెచ్. మహేందర్ జి(District Additional Collector CH Mahenderji) అన్నారు. జనగణన–2027  జనాభా గణనకు సంబంధించి గణన విభాగాల కార్యనిర్వాహక సిబ్బంది, సాంకేతిక సహాయకులకు అక్టోబర్ 13, 14 తేదీల్లో ములుగు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహిస్తున్న రెండో దశ  శిక్షణ కార్యక్రమానికి మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సాంకేతిక శిక్షణను సద్వినియోగం చేసుకుని, వివరాల నమోదులో తప్పులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గతంలో కాగితాలపై నమోదు చేసిన జనగణన వివరాలను ఈసారి ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా నమోదు చేయనున్నట్లు వివరించారు. అందుకు సంబంధించిన సాంకేతిక అంశాలను క్షుణ్ణంగా నేర్చుకోవాలని, సందేహాలను శిక్షణలోనే నివృత్తి చేసుకోవాలని తెలిపారు. జనగణనలో ప్రతి దశలో చేపట్టాల్సిన పనులపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.

ప్రజల నుంచి సేకరించిన వివరాలను జాగ్రత్తగా పరిశీలించి, ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శిక్షకులు ఏ.ఆర్. యువేందర్ బాబు, సిహెచ్. ఎస్‌వీఎస్ నాయుడు, కలెక్టరేట్ పరిపాలన అధికారి అల్లం రాజ్ కుమార్, తహసీల్దార్ విజయభాస్కర్, ఎస్‌ఓ లాల్ నాయక్, కలెక్టరేట్ పర్యవేక్షకురాలు మంజుల, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు