పుట్టిన ఊరి రుణం తీర్చుకుంటున్న...

13-10-2026 | 05:18pm
  1. బతుకమ్మ కానుకగా ఆడపడుచులకు చీరల పంపిణీ
  2. సుమారు రూ.లక్ష విలువైన చీరల అందజేత.. గ్రామాభివృద్ధికి దాత విశేష కృషి
  3. సర్పంచ్ తాలూకా మహేశ్వరీ సాయిబాబా ప్రశంసలు

చేగుంట అక్టోబర్ 13,విజయక్రాంతి: పుట్టిన ఊరిపై మమకారంతో, స్వగ్రామ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు(Service Activities) చేపడుతున్న దాత అయ్యంగల్ల సత్యనారాయణ సేవలు(Services of Ayyangalla Satyanarayana) ఆదర్శనీయమని చందాయిపేట గ్రామ సర్పంచ్ తాలూకా మహేశ్వరీ సాయిబాబా, ఉపసర్పంచ్ నగేష్ గుప్తా కొనియాడారు.

బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో సోమవారం రాత్రి ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన ప్రముఖ దాత అయ్యంగల్ల సత్యనారాయణ తన సొంత ఖర్చులతో సుమారు రూ.లక్ష విలువైన చీరలను కొనుగోలు చేసి గ్రామ మహిళలకు బతుకమ్మ కానుకగా అందజేశారు.

మరిన్ని వార్తలు