బతుకమ్మ పోస్టర్ల ఆవిష్కరణ
ఖానాపూర్ (విజయక్రాంతి): తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ పండుగ బతుకమ్మ పోస్టర్లనుజిల్లాలో డి ఆర్ డి ఓ విజయలక్ష్మి, జిల్లా ఖజానా శాఖ అధికారి సరోజ(District Treasury Officer Saroja) ఆవిష్కరించారు. జిల్లాలో జరిగే వేడుకల్లో పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో TGOs నిర్మల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ పి జి రెడ్డి, ధాత్రిక రమేష్‌లు మాట్లాడుతూ... తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ పండుగను గెజిటెడ్ ఉద్యోగులందరూ ఐకమత్యంతో, అత్యంత వైభవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో TGOs నిర్మల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు అర్చన, జిల్లా కార్యవర్గ సభ్యురాలు లతతో పాటు పలువురు గెజిటెడ్ మహిళా ఉద్యోగులు, సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.