జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేయాలి

13-10-2026 | 06:42pm

వెంకటాపూర్ (విజయక్రాంతి): తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్(Telangana Journalist Association) జిల్లా అధ్యక్షుడిగా మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ బేతి సతీష్ యాదవ్ ఎన్నిక కావడం అభినందనీయమని వెంకటాపూర్ జర్నలిస్టు సంఘం అధ్యక్షుడు ఒద్దుల మురళీ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలోని తాళ్లపాడు సెంటర్‌ లో మండల జర్నలిస్టులు బేతి సతీష్ యాదవ్‌ ను శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా మురళీ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, వారి సంక్షేమానికి యూనియన్ నాయకుడిగా సతీష్ నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు, వారి సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని సూచించారు. అనంతరం సతీష్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల జర్నలిస్టులు బిక్షపతి, యోగి, రామకృష్ణ, విక్రమ్, రఫీ, సంపత్, సారంగం, వినీల్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు