AIని వాడేవారే నిలబడతారు: RGV షాకింగ్ కామెంట్స్!
జీతం మనుషులకు.. పని మాత్రం AIకి! ఉద్యోగాలపై ఆర్జీవీ సంచలన పోస్ట్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఉద్యోగాలు పోతున్నాయనే ఆందోళన ఒకవైపు.. అదే AIని ఉద్యోగులు రహస్యంగా ఉపయోగిస్తూ తమ పనులను చేయించుకుంటున్నారనే వాదన మరోవైపు! ఈ అంశంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన పోస్ట్ ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. కంపెనీల్లో ఉద్యోగులు AI తమ ఉద్యోగాలను లాగేసుకుంటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. వాస్తవానికి కొందరు ఉద్యోగులు తమ పనులను AIతో చేయించుకుంటూ తమ పాత్రను తామే తగ్గించుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
సాఫ్ట్వేర్ ఇంజినీర్లు స్వయంగా Code రాయడానికి బదులుగా Requirementsను Claude వంటి AI Toolsకు ఇచ్చి కొద్ది సెకన్లలో కోడ్ పొందుతున్నారని వర్మ ఉదాహరణగా పేర్కొన్నారు. మార్కెటింగ్ ఉద్యోగులు Campaign Ideas కోసం ChatGPTని ఉపయోగించి, వచ్చిన ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకుని తమ ఆలోచనగా Meetingలో ప్రదర్శిస్తున్నారని వివరించారు. అలాగే డేటా అనలిస్టులు Spreadsheetలను AIకి అప్లోడ్ చేసి, వాటితోనే Data Analysis, Executive Summary తయారు చేయించుకుంటున్నారని చెప్పారు.
డిజైనర్లు కూడా తమ Creative Work కోసం Midjourney వంటి AI Platformsను ఉపయోగించి అనేక Designs రూపొందించుకుంటున్నారని వర్మ ప్రస్తావించారు. కస్టమర్ సపోర్ట్ విభాగంలోనూ AIతో Replies తయారు చేయించి, వాటిని నేరుగా కస్టమర్లకు పంపిస్తున్నారని పేర్కొన్నారు. ఇలా ఉద్యోగులు AIని ఉపయోగిస్తున్నప్పటికీ.. ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా రహస్యంగా ఉంచుతున్నారని తన పోస్ట్‌లో అభిప్రాయపడ్డారు.
కంపెనీలకు ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రత్యేకంగా Spies లేదా Cameras అవసరం లేదని, ఉద్యోగుల Performance, Output, Quality, Deadlines వంటి Metrics ద్వారానే మార్పులు స్పష్టమవుతాయని వర్మ వ్యాఖ్యానించారు. తక్కువ సమయంలో ఎక్కువ పని పూర్తవడం, ఉత్పాదకత పెరగడం, ఖర్చులు తగ్గడం వంటి పరిణామాలు కంపెనీల నిర్ణయాలను ప్రభావితం చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. AIకి సెలవులు, అనారోగ్యం, జీతాల పెంపు వంటి అంశాలు ఉండవని.. నిరంతరం పని చేయగల సామర్థ్యం దానికి ఉందని వివరించారు. ఉద్యోగాల కోతలు జరిగినప్పుడు టెక్నాలజీని లేదా కంపెనీలను మాత్రమే నిందించడం సరైనది కాదని వర్మ తన పోస్టులో పేర్కొన్నారు.
ఉద్యోగులు AIతో పనులు చేయించుకుంటూ, ఆ విషయాన్ని దాచిపెట్టడం కాకుండా బహిరంగంగా ఉపయోగించి తమ Skillsను మెరుగుపరుచుకోవాలని సూచించారు. భవిష్యత్తులో AIని సమర్థంగా ఉపయోగించగలవారికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని, దాన్ని ఉపయోగించని వారు పోటీలో వెనుకబడే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. “AIని ఉపయోగించే వ్యక్తులు.. AIని ఉపయోగించని వ్యక్తుల స్థానాన్ని భర్తీ చేస్తారు” అనే భావనతో వర్మ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం Technology, Employment, Future Jobs అంశాలపై మరోసారి చర్చకు తెరలేపుతోంది.