శివయ్య సన్నిధిలో మంచు వర్షం

27-11-2026 | 10:40am

మంచు దుప్పట్లో కేదార్‌నాథ్.. కనువిందు చేస్తున్న అద్భుత దృశ్యం!

కేదార్‌నాథ్:  ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్(Kedarnath Temple) ధామ్ మంచు అందాలతో కనువిందు చేస్తోంది. భారీ హిమపాతం కారణంగా ఆలయ ప్రాంగణం మొత్తం తెల్లని మంచుతో కప్పుకుపోయింది. చుట్టూ మంచు కొండలు.. మధ్యలో మంచు దుప్పటి కప్పుకున్న ఆలయం.. ఈ అద్భుత దృశ్యం ప్రకృతి ప్రేమికులను, శివభక్తులను ఆకట్టుకుంటోంది. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలో గురువారం రాత్రి, నవంబర్ 26న భారీ Snowfall నమోదైంది. ఈ హిమపాతం ప్రభావంతో కేదార్‌నాథ్ ఆలయ పరిసరాలు పూర్తిగా మంచుతో నిండిపోయాయి. ఆలయ ప్రాంగణం నుంచి చుట్టుపక్కల ప్రాంతాల వరకు ఎటుచూసినా తెల్లని మంచు పొరలు కనిపిస్తున్నాయి.

సాధారణంగా ఆధ్యాత్మిక ప్రశాంతతకు పేరుగాంచిన కేదార్‌నాథ్ ప్రాంతం.. తాజా హిమపాతంతో మరింత అద్భుతంగా కనిపిస్తోంది. మంచుతో కప్పబడిన ఆలయ పరిసరాల దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రకృతి సృష్టించిన ఈ అందమైన దృశ్యం కేదార్‌నాథ్ ధామ్‌కు మరో ప్రత్యేక రూపాన్ని తీసుకొచ్చింది. శివయ్య సన్నిధిలో కురిసిన మంచు.. ఆలయ పరిసరాలను తెల్లని లోకంలా మార్చేసింది. హిమాలయాల మధ్య వెలసిన ఈ పుణ్యక్షేత్రం తాజా Snowfall‌తో చూపరులను మంత్రముగ్ధులను చేస్తోంది.

మరిన్ని వార్తలు