బ్యాంకులకు భారీ సెలవులు.. పూర్తి లిస్ట్ ఇదే

27-11-2026 | 10:49am

డిసెంబర్‌లో బ్యాంకులకు భారీ సెలవులు.. ఈ తేదీలు మిస్ అయితే మీ పనులు ఆగినట్లే!

న్యూఢిల్లీ: 2026 ఏడాదికి చివరి నెల డిసెంబర్(December 2026 Bank Holidays) వచ్చేస్తోంది. కొత్త నెలతో పాటు పండుగలు, సెలవుల సందడి కూడా మొదలుకానుంది. విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే Holidays కోసం ఎదురుచూస్తుండగా.. ప్రయాణాలకు కూడా చాలామంది ప్లాన్స్ చేసుకుంటున్నారు. అయితే ఈ నెలలో బ్యాంక్ పనులు ఉన్నవారు మాత్రం ముందుగానే అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే Christmas సహా ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలతో కలిపి డిసెంబర్‌లో బ్యాంకులకు పలు సెలవులు రానున్నాయి.

డిసెంబర్ బ్యాంక్ హాలిడేస్ ఇవే..

వచ్చే నెలలో డిసెంబర్ 1, 3, 9, 11, 18, 19, 24, 26, 30, 31 తేదీల్లో వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు(December Bank Holiday List) మూతపడనున్నట్లు సెలవుల జాబితాలో పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్‌లో Indigenous Faith Day, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 1న బ్యాంకులకు సెలవు ఉంటుంది. గోవాలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ కారణంగా డిసెంబర్ 3న బ్యాంకులు పనిచేయవు. సిక్కింలో Losoong/Namsoong పండుగ సందర్భంగా డిసెంబర్ 9, 11 తేదీల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. మేఘాలయలో యు సోసో థామ్ వర్ధంతి(U SoSo Tham 83rd Death Anniversary) సందర్భంగా డిసెంబర్ 18న, గోవా విమోచన దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 19న బ్యాంకులు మూతపడనున్నాయి. అలాగే డిసెంబర్ 24న క్రిస్మస్ ఈవ్ సందర్భంగా మేఘాలయ, మిజోరం, నాగాలాండ్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇక డిసెంబర్ 25న Christmas సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసివేయనున్నారు. వీటితో పాటు డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో ఆదివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. డిసెంబర్ 12 రెండో శనివారం, 26 నాలుగో శనివారం కావడంతో ఆ రోజుల్లోనూ బ్యాంక్ బ్రాంచ్‌లు పనిచేయవు. రాష్ట్రాలవారీగా సెలవుల తేదీల్లో మార్పులు ఉండే అవకాశం ఉన్నందున ఖాతాదారులు తమ ప్రాంతంలోని బ్యాంక్ Holiday Calendar‌ను పరిశీలించడం మంచిది.

ఏయే బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి?

బ్యాంకులకు సెలవులు ఉన్న రోజుల్లో సాధారణంగా Branch Operations మాత్రమే నిలిచిపోతాయి. అంటే నగదు డిపాజిట్, విత్‌డ్రా, చెక్ క్లియరెన్స్, ఇతర బ్రాంచ్‌కు వెళ్లి చేయాల్సిన పనులు అందుబాటులో ఉండకపోవచ్చు. అయితే Digital Banking సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. ఖాతాదారులు UPI, NEFT, RTGS, IMPS వంటి Online Payment విధానాల ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. Mobile Banking, Internet Banking సేవలను కూడా ఉపయోగించుకోవచ్చు. ATM సేవలు సైతం అందుబాటులో ఉంటాయి. కాబట్టి బ్యాంక్‌కు నేరుగా వెళ్లి చేయాల్సిన పనులు ఉన్నవారు సెలవుల తేదీలను ముందుగానే చూసుకుని తమ పనులను ప్లాన్ చేసుకోవడం మంచిది.

మరిన్ని వార్తలు