అర్ధరాత్రి నుంచి దంచికొట్టిన వానలు

27-11-2026 | 06:45am

ఒకవైపు చలి.. మరోవైపు వర్షం.. హైదరాబాద్ ప్రజలు వణికిపోతున్నారు!

హైదరాబాద్: తెలంగాణలో వర్షాలు(heavy Rainfall) కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరాన్ని అర్ధరాత్రి వర్షాలు ఒక్కసారిగా ముంచెత్తాయి. తెల్లవారుజామున 1 గంట తర్వాత గచ్చిబౌలి, హైటెక్ సిటీ, హఫీజ్‌పేట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లపైకి వర్షపు నీరు చేరింది. దీంతో Late Night ప్రయాణాలు చేస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో Waterlogging కారణంగా ట్రాఫిక్ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అర్ధరాత్రి 2 గంటల సమయానికి వర్ష తీవ్రత మరింత విస్తరించి Core Hyderabad వైపు కదులుతున్నట్లు Weather Update వెల్లడించింది. పశ్చిమ, ఈశాన్య హైదరాబాద్ ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురవగా.. మల్కాజిగిరి, కాప్రా, మియాపూర్ ప్రాంతాల్లో వర్షం క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంచనా.

మరోవైపు అమీర్‌పేట్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, బేగంపేట్, బాలానగర్, హిమాయత్‌నగర్, ముషీరాబాద్ ప్రాంతాలతో పాటు ఉప్పల్, నాగోల్, పెద్ద అంబర్‌పేట్, హయత్‌నగర్, కుంట్లూర్ వైపు వచ్చే 1–2 గంటల్లో వర్షాలు విస్తరించే అవకాశం ఉందని తాజా సమాచారం సూచిస్తోంది. దీంతో తెల్లవారుజామున ప్రయాణాలు చేసే ఉద్యోగులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు రహదారులు, నీరు నిలిచే ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

అత్యవసరమైతే తప్ప వర్షం తీవ్రంగా ఉన్న సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిది. గురువారం అర్ధరాత్రి నుంచి మొదలైన వాన శుక్రవారం ఉదయం కూడా కొనసాగుతోంది. మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పనుల కోసం బయటకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, వాహనదారులకు వర్షం కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో కొన్ని ప్రాంతాల్లో ప్రయాణాలు నెమ్మదిస్తున్నాయి. మరోవైపు ఒక్కసారిగా మారిన Weather పరిస్థితులతో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వర్షంలో ప్రయాణించే వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు