'యోగి లేకపోతే యూపీ లేదు': సంజయ్ రౌత్
బీజేపీలో సీఎం రేసు వేడెక్కుతుంటే.. యోగికి విపక్ష నేత జైకొట్టారు!
ముంబై: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు(Uttar Pradesh Assembly Elections 2027) ముందే సీఎం అభ్యర్థి అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సమయంలో విపక్ష శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్(Sanjay Raut) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. బీజేపీ నాయకత్వంపై చర్చ జరుగుతున్న వేళ.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు రౌత్ బహిరంగంగా మద్దతు పలకడం చర్చనీయాంశమైంది. ముంబైలో మీడియాతో మాట్లాడిన సంజయ్ రౌత్.. యోగి ఆదిత్యనాథ్‌ను(Yogi Adityanath) సమర్థవంతమైన నాయకుడిగా అభివర్ణించారు. హిందుత్వానికి ఆయన తిరుగులేని ముఖచిత్రమని ప్రశంసించారు. 2027 ఎన్నికల్లో బీజేపీ తరఫున యోగి తన పేరును సీఎం అభ్యర్థిగా స్పష్టం చేసుకుంటే అది అభినందనీయమని పేర్కొన్నారు. తమకు కూడా యోగి అంటే ఇష్టమని, హిందుత్వ రాజకీయాల్లో ఆయన అత్యున్నత స్థానంలో ఉన్నారని వ్యాఖ్యానించారు. “యోగి ఉంటేనే యూపీ.. యోగి లేకపోతే యూపీ లేదు” అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ చర్చకు కేంద్రంగా మారాయి.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజారిటీ సాధిస్తుందని, ఎన్నికల తర్వాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తనకే మద్దతు ఇస్తారనే నమ్మకం యోగిలో కనిపిస్తోందని రౌత్ విశ్లేషించారు. మరోవైపు యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య చేసిన వ్యాఖ్యలు ఈ Leadership Debateకు మరింత ఆజ్యం పోశాయి. 2027 ఎన్నికల్లో బీజేపీకి కమలం గుర్తే ప్రధానమని, ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్ర పరిశీలకుల సమక్షంలో ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ.. ఎవరు ఎలాంటి వారో అందరికీ తెలుసని బదులిచ్చారు. దీంతో బీజేపీలో నాయకత్వంపై చర్చ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాల మధ్య ప్రతిపక్ష కూటమికి చెందిన సంజయ్ రౌత్ యోగికి అనుకూలంగా మాట్లాడటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో 2017, 2022 ఎన్నికల్లోనూ బీజేపీ ముందుగానే సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. ఎన్నికల తర్వాత యోగి ఆదిత్యనాథ్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంది. మరి 2027లో బీజేపీ ఎలాంటి Strategy అనుసరిస్తుందో చూడాలి.