వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్

27-11-2026 | 10:35am

విదేశాలకు వెళ్తున్నారా? ఇక WhatsApp‌లోనే ఇంటర్నెట్ eSIM కొనొచ్చు!

విదేశీ ప్రయాణాలు చేసే వారికి WhatsApp అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇకపై ఇంటర్నేషనల్ ట్రిప్‌కు వెళ్లినప్పుడు ప్రత్యేకంగా Local SIM కొనడం, ఎయిర్‌పోర్టులో Wi-Fi కోసం వెతకడం, భారీ Roaming Charges చెల్లించడం వంటి ఇబ్బందులు తగ్గనున్నాయి. నేరుగా WhatsApp యాప్‌లోనే Travel eSIM కొనుగోలు చేసి, Install చేసుకునే సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు Meta సంస్థ ప్రకటించింది. ఈ కొత్త Feature ద్వారా వినియోగదారులు యాప్ నుంచి బయటకు వెళ్లకుండానే కొన్ని సులభమైన Steps‌లో Data eSIM కొనుగోలు చేయవచ్చు. విదేశాలకు చేరుకున్న తర్వాత కూడా తమ ప్రస్తుత ఫోన్ నంబర్‌తోనే WhatsApp సేవలను కొనసాగించవచ్చు. ఇందుకోసం మరో కొత్త SIM నంబర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదని కంపెనీ వెల్లడించింది. ముఖ్యంగా Airport Kiosks వద్ద సిమ్ కోసం వెతకడం, ఉచిత Wi-Fi కోసం కేఫ్‌లకు వెళ్లడం వంటి ఇబ్బందులు తగ్గనున్నాయి.

ఈ సేవ కోసం WhatsApp పలు eSIM Providers, Telecom Partners‌తో కలిసి పనిచేస్తోంది. ఈ భాగస్వాముల్లో భారత టెలికాం సంస్థ Jioతో పాటు Smart Axiata, Smart Communications, అమెరికాకు చెందిన Verizon ఉన్నాయి. ఎంపిక చేసిన కొన్ని దేశాల్లో ఈ Feature‌ను త్వరలో దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ తెలిపింది. అయితే ఈ సదుపాయం మొదట ఏయే దేశాల్లో ప్రారంభమవుతుంది? eSIM ధరలు ఎంత ఉంటాయి? ఏయే Data Plans అందుబాటులో ఉంటాయి? అనే వివరాలను WhatsApp ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ ఫీచర్‌కు సంబంధించిన Rollout ప్రణాళికను సిద్ధం చేస్తోంది. అందుబాటులోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ ప్రయాణికులకు Mobile Internet వినియోగం మరింత సులభం కానుంది. మొత్తంగా చూస్తే WhatsApp కేవలం Messaging App‌గానే కాకుండా ప్రయాణికులకు ఉపయోగపడే కొత్త Digital Services‌ను కూడా అందించే దిశగా అడుగులు వేస్తోంది. Travel eSIM Feature అందుబాటులోకి వస్తే విదేశాలకు వెళ్లే వారికి కనెక్టివిటీ విషయంలో మరింత సౌలభ్యం కలగనుంది.

మరిన్ని వార్తలు