త్వరలోనే ఆలయ నిర్మాణం పూర్తి చేస్తాం: ఎమ్మెల్యే కోవ లక్ష్మి

27-11-2026 | 12:09pm

పోచమ్మ ఆలయ నిర్మాణానికి భూమి పూజ

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మండలంలోని బూరుగూడ గ్రామం(Buruguda village)లో పోచమ్మ ఆలయ నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి(MLA Kova Lakshmi) భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామస్థులు గతంలో పోచమ్మ ఆలయ నిర్మాణం(Pochamma temple construction) చేపట్టాలని కోరగా, ఇచ్చిన హామీ మేరకు భూమి పూజ నిర్వహించినట్లు తెలిపారు. త్వరలోనే ఆలయ నిర్మాణ పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

అంతకుముందు గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు మేకర్తి లచ్చన్న, బుజడి కుమార్, గాజుల రాజేంద్రప్రసాద్, రమేష్, బాలకృష్ణ, సతీష్, ప్రకాష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు