ఆది కొత్త సినిమా
మిస్టరీ, మిస్టిక్ ఎలిమెంట్స్‌తో ఆది కొత్త సినిమా.. అక్టోబర్ 20న కీలక అప్‌డేట్!
హీరో ఆది సాయికుమార్ మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నవరసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కొత్త Mystic Thriller Movie అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఇప్పటికే ఆసక్తిని పెంచుతోంది. పురాతన ఆచారాలను తలపించే వాతావరణం, త్రిశూలాన్ని చుట్టుకున్న నాగుపాము వంటి అంశాలతో రూపొందించిన పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది.
త్రిశూల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం(Pan India Film)కు సంబంధించిన మరిన్ని వివరాలను అక్టోబర్ 20న వెల్లడించనున్నారు. ఈ చిత్రంలో దాగి ఉన్న మిస్టరీ ఏమిటి? ఆది సాయికుమార్ ఎలాంటి కొత్త పాత్రలో కనిపించబోతున్నారు? తెలియాలంటే అక్టోబర్ 20 వరకు వేచి చూడాల్సిందే.