పట్టణంలో "అంగన్ మిలన్"కార్యక్రమం

06-10-2026 | 06:46pm

మేడ్చల్ మున్సిపల్ పట్టణ బిజెపి అధ్యక్షురాలు: జల్లి శైలజ హరినాథ్

మేడ్చల్ అర్బన్ అక్టోబర్ 6 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం చేపట్టిన "సేవా సంకల్ప్ అభియాన్"లో బాగంగా మేడ్చల్ డివిజన్ పరిధిలోని గిర్మాపూర్ మున్సిపల్ పట్టణ అంగన్వాడి 1,2 కేంద్రాల్లో మేడ్చల్ డివిజన్ బిజెపి అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్ ఆధ్వర్యంలో "అంగన్ మిలన్(Angan Milan)"కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లులు అంగన్వాడి టీచర్ లు ఆశా వర్కర్ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రాలలోని చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, ఆరోగ్య సంరక్షణ,ప్రాథమిక విద్యా తదితర సేవలపై తల్లి తండ్రులకు అవగాహన కల్పించారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,అంగన్వాడి సేవల ప్రాధాన్యతను వివరించినట్లు జల్లి శైలజ హరినాథ్ స్పష్టం చేశారు.

కార్యక్రమంలో భాగంగా చిన్నారుల ఆరోగ్యం, పోషణ, సంరక్షణ కోసం సేవలందిస్తున్న అంగన్వాడి టీచర్ లు కళావతి, వనజ, ఆశా వర్కర్ బాలమణీ లను ఘనంగా సన్మానించినట్లు ఆమే తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కిసాన్ మోర్ఛ కార్యవర్గ సభ్యులు కొండo ఆంజనేయులు ముదిరాజ్.బిజెపి జిల్లా కోశాధికారి లవంగ శ్రీకాంత్.ప్రధాన కార్యదర్శి జాకట ప్రేమ్ దాస్.జిల్లా బీజేవైఎం మాజి కార్యదర్శి బి రాఘవరెడ్డి.మేడ్చల్ డివిజన్ బిజెపి కార్యదర్శులు బండి విష్ణు గౌడ్.బొక్క సురేందర్ రెడ్డి.జిల్లా కిసాన్ మోర్ఛ నాయకులు బొక్క శ్రీనివాస్ రెడ్డి.మహిళా నాయకురాళ్ళు అనిత.వంగేటి హానుమంత రెడ్డి.వేముల రాజిరెడ్డి.సత్యనారాయణ రెడ్డి.వంశీధర్ రెడ్డి.గౌలికర్ మహేష్.తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు