వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు జయశంకర్ పేరు పెట్టాలి

06-10-2026 | 08:47pm

వెంకటాపూర్, అక్టోబర్ 6 (విజయక్రాంతి):వరంగల్‌లో నిర్మిస్తున్న మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు(Mamunuru Airport) తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ పేరు పెట్టాలని మండల బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మునిగంటి నరేంద్ర చారి(BRS leader Muniganti Narendra Chari) ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ జీవితాంతం కృషి చేసి, ప్రజల్లో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, చైతన్యాన్ని నింపారని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన సేవలు చిరస్మరణీయమని అన్నారు. మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఎయిర్‌పోర్ట్ గా పేరు పెట్టడం ద్వారా ఆయన సేవలకు సముచిత గౌరవం దక్కుతుందని నరేంద్ర చారి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ అంశాన్ని పరిశీలించి, జయశంకర్ పేరు పెట్టేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు