కాంగ్రెస్ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యం.

06-10-2026 | 08:38pm

రాజాపూర్ అక్టోబర్ 6: కాంగ్రెస్(Congress) పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడు కష్టపడి పని చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్ గౌడ్ అన్నారు. మంగళవారం మండలంలోని ఈద్గాన్ పల్లి మల్లేపల్లి నాన్ చెరువు తాండ రాయపల్లి ముదిరెడ్డిపల్లి బీబీనగర్ తాండ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను ఎన్నుకున్నారు. అలాగే యువత విభాగం ఎస్సీ సెల్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రమేష్,శివకుమార్,వెంకట నాయక్, దశరథ్ రాజేష్ కృష్ణయ్య యాదవ్ శ్రీశైలం శేఖర్ బాసు నాయక్ గణేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు