బనిగండ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే

06-10-2026 | 08:57pm

ఎర్రుపాలెం అక్టోబర్ 6 (విజయక్రాంతి): బనిగండ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ అశ్విని ఆధ్వర్యంలో ఆశాడే కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా వైద్యాధికారి డాక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ అక్టోబర్ 1 నుంచి 31వ తేదీ వరకు రొమ్ము క్యాన్సర్ అవగాహన(Breast Cancer Awareness) మాసంగా నిర్వహించడం జరుగుతుందని, మహిళలలో వచ్చే రొమ్ము క్యాన్సర్ గురించి ఆశా కార్యకర్తలు,సిబ్బంది  గ్రామాలలో ఉన్న మహిళకు అవగాహన కల్పించడంలో భాగంగా ముందుగా గుర్తించడం,40 ఏళ్లు దాటిన మహిళలు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి రొమ్ము క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలి.

రొమ్ముల్లో గడ్డలు, అసాధారణ రక్త స్రావం లేదా ఇతర మార్పులు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని, తొలి దశలో గుర్తిస్తే మెరుగైన చికిత్స ద్వారా వ్యాధి నివారించవచ్చని తెలిపారు. సమావేశం అనంతరం సిబ్బంది మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయుర్వేద డాక్టర్ వెంకట్ లాల్, సి హెచ్ ఓ కాంతమ్మ, హెడ్ నర్సింగ్ ఆఫీసర్ నాగాశిరోమణి, హెచ్ ఈ ఓ భాస్కరరావు, సూపర్ వైజర్లు లంకా కొండయ్య, లతాశ్రీ, నర్సింగ్ ఆఫీసర్ ఈశ్వరి లక్ష్మీ, హెల్త్ అసిస్టెంట్లు, ఎం ఎల్ హెచ్ పి  లు, ఏఎన్ఎం లు ల్యాబ్ టెక్నీషియన్ నస్రత్, ఫార్మాసి ఆఫీసర్ అమృత్, మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు