రైతులకు కోతలు.. సామాన్యులకు వాతలు

06-10-2026 | 02:27pm

హైదరాబాద్: దసరా, దీపావళి పండుగలకు ముందు ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) రూ.5,420 కోట్ల విద్యుత్ భారం (Power Burden) మోపేందుకు సిద్ధమైందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఇప్పటికే కరువు, ఎల్‌నినో (El Niño), పెరిగిన నిత్యావసర ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై విద్యుత్ ఛార్జీల పెంపు (Power Tariff Hike) మరింత భారంగా మారుతుందని విమర్శించారు.

పండుగల వేళ ప్రజలకు ఊరట కల్పించాల్సింది పోయి విద్యుత్ ధరలు పెంచడం ఏంటని ప్రశ్నించారు. ఒకవైపు రైతులకు విద్యుత్ కోతలు.. మరోవైపు సామాన్యులపై అదనపు విద్యుత్ భారం మోపుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.


మరిన్ని వార్తలు