రేపు మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి

06-10-2026 | 08:38pm

ల్యాండ్ పూలింగ్ పై గ్రామ సభలు

ఘట్ కేసర్, అక్టోబర్ 6 (విజయక్రాంతి) : ఈనెల 7న (బుధవారం) ఘట్ కేసర్ సర్కిల్ డివిజన్ ప్రాంతాలలో మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి - ల్యాండ్ పూలింగ్ పై గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని ఘట్కేసర్ తహసిల్దార్ బి. చంద్రశేఖర్ తెలిపారు. 

ప్రతాపసింగారం, కాచవానిసింగారం,  ముత్తివెల్లిగూడ ప్రాంతాలకు ప్రతాప సింగారం రైతు వేదిక వద్ద మధ్యాహ్నం 2.30 గంటలకు, కొర్రెములలో పాత గ్రామ పంచాయతీ కార్యాలయం  వద్ద మధ్యాహ్నం 3.30 గంటలకు అలాగే ఎదులాబాద్ లో పాత గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సాయంత్రం 4.30 గంటలకు గ్రామ సభలు జరుగుతాయని తెలిపారు.

గ్రామ సభల్లో మూసీ ల్యాండ్ పూలింగ్, డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌కు సంబంధించి పట్టాదార్లు, రైతులు, గ్రామస్తులతో చర్చించి, ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించి వారి అభిప్రాయాలు, సూచనలు, సమ్మతిని స్వీకరించడం జరుగుతుందన్నారు. సంబంధిత పట్టాదారులు, రైతులు, గ్రామస్తులు అందరూ సంబంధిత వేదిక వద్దకు సమయానికి హాజరు కావాలని తాహసిల్దార్ చంద్రశేఖర్ కోరారు.

మరిన్ని వార్తలు