క్రిశాంక్ అరెస్ట్‌తో బీఆర్ఎస్‌లో ఆగ్రహం
బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వైద్య పరీక్షల (Medical Tests) నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు పూర్తైన తర్వాత మేజిస్ట్రేట్ (Magistrate) ముందు హాజరుపరిచేందుకు సికింద్రాబాద్ కోర్టుకు తీసుకెళ్లారు.రేవంత్‌రెడ్డి కుటుంబానికి సంబంధించి రూ.50 వేల కోట్ల బినామీ పెట్టుబడులు, అవినీతిపై ప్రశ్నిస్తూ ప్రెస్‌మీట్ (Press Meet) నిర్వహించినందుకే క్రిశాంక్‌ను అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అరెస్ట్‌పై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
రేవంత్‌రెడ్డి కుటుంబంపై తాము చేసిన ఆరోపణల నేపథ్యంలోనే క్రిశాంక్‌ను అరెస్ట్ చేశారని పేర్కొంటూ.. ఆయనను వెంటనే బేషరతుగా విడుదల (Unconditional Release) చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ కోర్టు వద్దకు భారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు.