ఢిల్లీలో హైటెన్షన్... బారికేడ్లు ఎక్కిన రాహుల్
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా(Gyanesh Kumar resignation) చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఎంపీలు ఢిల్లీలో నిరసన చేపట్టారు. పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ‘నిర్వాచన్ సదన్’ వరకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు. ‘సేవ్ డెమోక్రసీ’ నినాదాలతో బ్యానర్లు ప్రదర్శించారు. ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) బారికేడ్‌పైకి ఎక్కి, అనంతరం అక్కడే ధర్నాకు కూర్చున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
సీఈసీపై ఒత్తిడి పెంచే దిశగా కాంగ్రెస్(Congress) వరుస ఆందోళనలకు సిద్ధమైంది. అక్టోబర్ 10 నుంచి 20 వరకు ‘సేవ్ ఓట్.. సేవ్ కంట్రీ’(Save Vote Save Country) పేరుతో బ్లాక్ స్థాయిలో ప్రచారం నిర్వహించనుంది. సైకిల్, బైక్ ర్యాలీలు, కరపత్రాల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టనుంది. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 25 వరకు బూత్ స్థాయిలో చౌపాల్స్ నిర్వహించడంతో పాటు, నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ ప్రణాళిక రూపొందించింది.
నవంబర్ 25, 26 తేదీల్లో ‘చలో ఢిల్లీ’ మార్చ్‌లు నిర్వహించాలని నిర్ణయించింది. ఇదే సమయంలో ఎన్నికల సంఘానికి సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల సంఘానికి కోర్టు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. అయితే సీఈసీపై తక్షణ చర్యలకు కోర్టు నిరాకరించింది. కేసుపై తదుపరి విచారణ కొనసాగనుంది.