క్రిశాంక్ రిమాండ్ రిజెక్ట్

06-10-2026 | 05:50pm

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్ సోషల్ మీడియా సమన్వయకర్త మన్నె క్రిశాంక్(Manne Krishank) అరెస్ట్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. క్రిశాంక్‌ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు రిమాండ్ కోరగా సికింద్రాబాద్ కోర్టు(Secunderabad Court) ఆ అభ్యర్థనను తిరస్కరించింది. సికింద్రాబాద్‌లోని మెడికవర్ ఆస్పత్రి సమీపంలో ఏర్పాటు చేసిన బ్యానర్లకు సంబంధించిన ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు క్రిశాంక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన న్యాయస్థానం రిమాండ్‌ను తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామంతో క్రిశాంక్ అరెస్ట్ వ్యవహారం మరోసారి రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు