పిల్లల కోసం భారీ వంటశాల

06-10-2026 | 04:47pm

ఎస్‌ఎం పేట: సూర్యాపేట జిల్లా(Suryapet district)లో మరో కీలక అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మునగాల మండలం ఎస్‌ఎం పేటలో రూ.9.6 కోట్ల అంచనా వ్యయంతో ఆధునిక కమ్యూనిటీ కిచెన్‌(Modern community kitchen) నిర్మాణానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. భూమిపూజ అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. హరేకృష్ణ సంస్థకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. కోదాడ కమ్యూనిటీ కిచెన్‌ను దేశంలోనే ఆదర్శంగా, నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దాలని సంస్థ ప్రతినిధులను కోరారు.

ఈ ఆధునిక వంటశాల అందుబాటులోకి వస్తే సుమారు 60 వేల మంది పిల్లలకు అల్పాహారం అందించే అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించడంలో కమ్యూనిటీ కిచెన్‌ కీలకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. కిచెన్‌ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా అవసరమైన సహకారంతో పాటు అదనపు విరాళాలు సమీకరించేందుకు కూడా చర్యలు తీసుకుంటామని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి(Uttam Kumar Reddy) వెల్లడించారు. పెద్ద స్థాయిలో ఆహారాన్ని తయారు చేసి, వేలాది మంది పిల్లలకు నాణ్యమైన అల్పాహారం అందించేలా ఈ కమ్యూనిటీ కిచెన్‌ను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయనున్నారు.

మరిన్ని వార్తలు