ఎస్ఆర్ఆర్ లో అలరించిన 'బిజ్ నోవా' ఫ్రెషర్స్ పార్టీ సంబరాలు
ముకరంపుర, అక్టోబర్ 6 (విజయ క్రాంతి): కరీంనగర్ లోని స్థానిక ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ అటనామస్ డిగ్రీ కళాశాలలోని(SRR Government Autonomous Degree College) కామర్స్ మరియు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ రెండవ,మూడవ సంవత్సరం విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులకు స్వాగతం పలుకుతూ 'బిజ్ నోవా' పేరుతో ఏర్పాటు చేసిన ప్రెషర్స్ పార్టీ సంబరాలు అలరించాయి.
ముఖ్య అతిథిగా పాల్గొన్న కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కల్వకుంట రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగం ఉపాధి నైపుణ్యాలను అందించే వివిధ అధునాతన కోర్సులను ప్రవేశపెట్టిందని, మంచి విషయ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంపొందించుకొని జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడాలని కోరారు.
కామర్స్ విభాగాధిపతి టి. రాజయ్య మాట్లాడుతూ కామర్స్ మరియు బిబి విద్యార్థులకు అపార ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, వాటికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకొని అత్యున్నత ఉద్యోగాన్ని సాధించాలని కోరారు.
కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ మల్లారెడ్డి మాట్లాడుతూ ఇటీవల ప్రవేశపెట్టిన బీకాం రిటైల్ ఆపరేషన్స్, బీకాం బిఎఫ్ఎస్ఐ వంటి ఏఈడిపి కోర్సు విద్యార్థులకు అప్రెంటిషిప్ ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఏర్పాటు చేసినటువంటి విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ పి నితిన్, టిజిసిజిటిఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కడారు సురేందర్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, జే ఉమారాణి, అటనామస్ సమన్వయకర్త డాక్టర్ ఎం శ్రీనివాసరెడ్డి ఐక్యుఏసి సమన్వయకర్త హర్ జ్యోత్ కౌర్ వివిధ విభాగాల అధిపతులు,అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు.