ట్రైనీ IPS ఉదయ్‌కు ఊరట
హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి(Trainee IPS Uday Krishna Reddy) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుమారు 67 రోజులుగా జైలులో ఉన్న ఆయనకు ఉప్పర్‌పల్లి కోర్టు(Upperpally Court) షరతులతో కూడిన బెయిల్(Bail) మంజూరు చేసింది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి గత జూలై 18న అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డి తనను కొంతకాలంగా వేధిస్తున్నారని, వాట్సాప్ ద్వారా అభ్యంతరకర సందేశాలు పంపుతున్నారని, అకాడమీలో ఇతరుల ఎదుట తనపై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆమె ఫిర్యాదులో ఆరోపించినట్లు సమాచారం.
ఈ ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు కేసు(Attapur Police Case) నమోదు చేసి ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్టు చేశారు. అనంతరం ఆయనను ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఈ క్రమంలో తాజాగా ఉప్పర్‌పల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఉదయ్ కృష్ణారెడ్డికి తాత్కాలిక ఊరట లభించింది. కేసులోని ఆరోపణలు ప్రస్తుతం న్యాయపరిధిలో ఉన్నందున, వాటిపై తుది నిర్ణయం విచారణ అనంతరం వెలువడనుంది.