పాము కాటుకు గురై ఇంటర్ విద్యార్థిని మృతి

06-10-2026 | 08:35pm

మూసాపేట్ /అక్టోబర్ 6: ముసపెట్ మండల పరిధిలోని నిజాలాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబంలో పాముకాటు(Snakebite) గురై ఒకరు మృతి మరొకరి పరిస్థితి విషమం. గ్రామానికి చెందిన గొల్ల శ్రీనివాసులు కొండమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు కుటుంబ సభ్యులంతా కలిసి సోమవారం రాత్రి భోజనం చేసి నిద్రించారు అర్ధరాత్రి సమయంలో లావణ్య శ్రావణి లకు తీవ్ర కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గ్రామస్తులు వారి పరిస్థితి గమనించి వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు.

అంబులెన్స్ వచ్చేలోపు కుటుంబ సభ్యులు ఇద్దరిని ఆటోలో జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మూసాపేట్ మండల కేంద్రానికి అంబులెన్స్ రావడంతో ఇద్దరిని అందులో ఎక్కించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో లావణ్య 17 సంవత్సరాలు మృతి చెందింది . మరో కూతురు 8 సంవత్సరాల శ్రావణి  జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఇద్దరికీ పాము కాటు వేయడంతో లావణ్య మృతి చెందిందని మరొకరు శ్రావణి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు