విద్యార్థులకు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి

29-09-2026 | 06:31pm

కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు వెంకట్రాంరెడ్డి   

చేగుంట సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): చేగుంట(Chegunta) మండలంలోని మక్కరాజుపేటలోని ప్రభుత్వ పాఠశాలలో సాంఘిక శాస్త్రం క్లస్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పదవి విరమణ పొందుతున్నటువంటి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మీర్జా పల్లిలో పనిచేస్తున్న సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు నూలి వెంకటరమణ రావుని, మండల సాంఘిక శాస్త్రం ఫోరం వారిని ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మక్కరాజ్ పేట కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వెంకట్రాం రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు చేసినటువంటి సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని, అదేవిధంగా ఉద్యోగానికి మాత్రమేనని, జీవితాన్ని కాదని అని, పదవి విరమణ తర్వాత వారి జీవితాన్ని దేశం గురించి పనిచేయాలి అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు చల్లా లక్ష్మణ్, పెంట గౌడ్, మంగ రాణి, నరసింహారావు, ఆంజనేయులు పవన్, యాదగిరి, సునీత హెలెన్, రమ్య శ్రీ, పద్మ  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు