ప్రతికూల వాతావరణంలో కేదార్ నాథ్ దర్శనం..
29-09-2026 | 07:02pm
తాడ్వాయి, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): కామారెడ్డి డివిజన్(Kamareddy Division)కు చెందిన వీరశైవ జంగమ సమాజం ప్రతినిధులు కేదార్ నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్కచేయకుండా ఆలయ దర్శనమే భాగ్యంగా ప్రతినిధులు వెళ్లి శివుడిని దర్శించుకున్నారు. భారీ వర్షాలు, క్లిష్టమైన భూభాగాలను సైతం చూడకుండా పవిత్ర శివుడి దర్శనమే భాగ్యంగా భావించి స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. దర్శించుకున్న వారిలో వీరశైవ జంగమ సమాజం కామారెడ్డి డివిజన్ అధ్యక్షులు జంగం ప్రభాకర్ స్వామి, ప్రధాన కార్యదర్శి జంగం ప్రభుదేవ్, కార్యవర్గ సభ్యులు జంగం ప్రవీణ్ జంగం సాయినాథ్ జంగం దిలీప్ తదితరులు ఉన్నారు.